Addam News
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 2:39 am Posted by : Addam News

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంచినీరు పంపిణీ

బ‌ర్క‌త్‌పుర‌, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) :     వినాయక నిమజ్జనం సందర్బంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) హైద‌రాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో బ‌ర్క‌త్‌పుర‌ సిగ్నల్ దగ్గర మంచి నీరు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ… డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ట్యాంక్ బండ్‌కు తరలి వెళ్తున్న ప్రజలకు మంచినీళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. సే నో టూ డ్రగ్స్, నో బెట్టింగ్ నినాదంతో కరపత్రలు పంపిని చేయడం జరిగిందన్నారు. ఒకవైపు యువజన సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూనే మరొకవైపు యువతను చైతన్యవంతం చేసే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జావీద్ మాట్లాడుతూ… ఐక్యమత్యంతో ఉండి విద్యార్థి యువత చెడు మార్గాల వైపు పయనించకుండా యువతను చైతన్యవంతం చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బహుముఖ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి కొమ్ము విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు పి.దేవేందర్, రాజు, మనిరాజ్,ఆదిత్య, సాయి, పంచాంక్షార్, సాయి రీత్విక్ తదితరులు పాలొగొన్నారు.