కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్ర‌గ్స్ మాఫియా, మాద‌క ద్ర‌వ్యాలు నిత్య కృత్యమైంది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 12, అద్దం న్యూస్ :   గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 3 పువ్వులు 6 కాయలుగా వెలసిన డ్రగ్స్ మాఫియా, మాదక ద్రవ్యాల సరఫరా తగ్గకపోగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్య కృత్యమైందని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా పేర్కొన్నారు. హైద‌రాబాద్ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గురువారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ మాఫియాకు కేంద్ర బిందువైందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల గాంధీభవన్ వద్ద యధేచ్ఛగా గంజాయి తాగుతూ...