దసరా వేడుకలు అందరిలో ఆనందం నింపాలి – ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) : సికింద్రాబాద్ పరిధిలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చెయ్యాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిలకలగూడలోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయాన్ని ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగకు ప్రాముఖ్యత ఉందని, ప్రజలు ఆనందంగా పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా...