తెలంగాణ ద‌ళిత ఐక్య వేదిక ఆధ్వ‌ర్యంలో ఈ నెల 12వ తేదీన ద‌స‌రా మిలాప్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 8, అద్దం న్యూస్ :  తెలంగాణ ద‌ళిత ఐక్య వేదిక ఆధ్వ‌ర్యంలో ఈ నెల 12వ తేద ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ ఎస్ఆర్‌టి క‌మ్యూనిటీహాల్‌లో ద‌స‌రా మిలాప్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐక్య వేదిక నాయ‌కులు తెలిపారు. ఈ ద‌సరా మిలాప్ కార్య‌క్ర‌మ స‌న్నాహ‌క‌ స‌మావేశం గురువారం ఎస్ఆర్‌టి క‌మ్యూనిటీహాల్‌లో జ‌రిగింది. తెలంగాణ ద‌ళిత ఐక్య వేదిక మీడియా క‌న్వీన‌ర్ గ‌జ్జ‌ల సూర్య‌నారాయ‌ణ‌, ద‌స‌రా మిలాప్ క‌న్వీన‌ర్లు ఆర్‌.వివేక్, గండి క్రిష్ణ‌, కేశ‌వ‌పురం స్వామి,...