తెలంగాణ రాష్ట్ర ద‌ళిత ఐక్య వేదిక ఆధ్వ‌ర్యంలో ద‌స‌రా మిలాప్ –  బేషజాలాల‌కు వెళ్ల‌కుండా ద‌ళితులు ఐక్యంగా ఉండి హ‌క్కుల కోసం పోరాడాలి – ద‌స‌రా మిలాప్‌లో వ‌క్త‌లు

 బేషజాలాల‌కు వెళ్ల‌కుండా ద‌ళితులు ఐక్యంగా ఉండి హ‌క్కుల కోసం పోరాడాలి – ద‌స‌రా మిలాప్‌లో వ‌క్త‌లు హైదరాబాద్, అక్టోబ‌ర్ 12, అద్దం న్యూస్ :      తెలంగాణ రాష్ట్ర ద‌ళిత ఐక్య వేదిక ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ద‌స‌రా మిలాప్ కార్య‌క్ర‌మం ఆదివారం వేడుక‌గా జ‌రిగింది. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ ఎస్ఆర్‌టి క్వాట‌ర్స్ క‌మ్యూనిటీహాల్‌లో జ‌రిగిన ఈ ద‌స‌రా మిలాప్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఎంఎన్‌.శ్రీనివాస్‌రావు, క‌వాడిగూడ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జి.ర‌చ‌న శ్రీ, ఐక్య వేదిక రాష్ట్ర నాయ‌కులు...