రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రొబేషనరీ డీఎస్‌పీలకు ఉద్బోధించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించాలన్న దృఢమైన సంకల్పంతో గ్రూప్-1 నియామకాలను పూర్తి చేశామని చెప్పారు. కొత్తగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ డీఎస్‌పీలతో ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో మంగ‌ళ‌వారం జరిగిన వ్యాలిడిక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శిక్షణ సమయంలో ట్రెయినీలు దిగిన ఫోటోల ప్రదర్శనను తిలకించారు. ‘క్రైమ్ సీన్ ఫోరెన్సిక్స్’ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు....