Economic Changes: 2026లో మీ జేబుపై ప్రభావం చూపించే 4 కీలక మార్పులు ఇవే!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మరికొన్ని గంటల్లో 2025 ముగిసి 2026లోకి అడుగుపెడుతున్న వేళ, సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు అందరి ఆర్థిక జీవితంపై ప్రభావం చూపించే పలు కీలక మార్పులు (Economic Changes) రానున్నాయి. ముఖ్యంగా వేతనాలు, పన్నులు, బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ఈ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. 1. 8వ వేతన సంఘం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలుపై 2026లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది అమలైతే ప్రభుత్వ ఉద్యోగుల...