ఎక్సైజ్ శాఖలో అవినీతిపై ఈడీ నజర్ -కమిషనర్ హరికిరణ్ పై ఈడీకి ఫిర్యాదు చేసిన రాచాల యుగంధర్ గౌడ్
ఆధారాలతో కూడిన పత్రాలు ఈడీ అధికారులకు సమర్పణ – విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 20, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) ప్రాంతీయ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ ను కలిసి...