Addam News
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 2:36 am Posted by : Addam News

విద్యా, వైద్య దోపిడిని చట్టాల ద్వారానే నియంత్రించాలి – ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు

విద్యా, వైద్య దోపిడిని చట్టాల ద్వారానే నియంత్రించాలి  

విద్య, వైద్యం పై విద్యార్థులు, యువజనలు పోరాడాలి

– ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :    ప్రస్తుతం సమాజంలో ప్రజలకు అందుబాటులో లేని విద్య, వైద్య దోపిడీని ప్రభుత్వాలు చట్టాల ద్వారానే నియంత్రించాలని, ప్రభుత్వాలు ఈ దోపిడీ నివారించే వరకు విద్యార్థులు యువజనులు మరిన్ని పోరాటాలు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు అన్నారు. అమరజీవి మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవంలో భాగంగా బుధ‌వారం హైద‌రాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ లో AIFDY -AIFDS రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అని జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశ ప్రారంభానికి ముందు వీరనారి సాకలి ఐలమ్మ చిత్రపటానికి, అమరజీవి ఓంకార్ చిత్రపటానికి హాజరైన వ్యక్తులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ… ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఆ దేశ ప్రజలకు ఉచితంగా విద్యా,వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నాయన్నారు. మన దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవ చేసింది ఏమీ లేదని.. ప్రజలు ఏదైనా అనారోగ్యాల గురైతే మంత్ర తంత్రాలను జపించే విధానాన్ని బోధిస్తుందని అన్నారు. విద్యలో పూర్తిగా కాషాయకరణను చెప్పించి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజలకు దూరం చేసే మనువాద పాలసీని తెచ్చిందని ఆరోపించాడు. భారత రాజ్యాంగంలోని ఆ దేశిక సూత్రాలు 31 నుండి 52 వరకు అమలు చేస్తే ప్రజలు ఉద్యమించవలసిన అవసరం ఉండదని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా విద్య వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తూ కార్పొరేట్, పెట్టుబడిదారులకు వ్యాపార సర్కుగా ప్రభుత్వాలు మార్చినాయన్నారు. అనేక పోరాటాల ఫలితంగా విద్య కంట్రోల్ బోర్డ్ ఏర్పాటు చేసినట్లే వైద్యాన్ని కూడా కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని గుర్తు చేశారు. ఏఐఎఫ్‌డివై జాతీయ సహాయ కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ… అమరజీవి ఓంకార్ ప్రజలకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అందాలని చట్టసభలలో తన గొంతు వినిపించారన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాల కన్నా ఉచిత విద్యా, వైద్యం అందించే వరకు పోరాడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ఏఐఎఫ్‌డివై రాష్ట్ర అధ్యక్షుడు కర్ర రాజిరెడ్డి, ఏఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐఎఫ్‌డివై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్, ఏఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వసకుల మట్టయ్య, ఏఐడిఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నితీష్, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, పిడిఎస్‌యు జార్జి రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎస్ నాగేశ్వరరావు, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాకేష్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతుగంటి కాశి, సహాయ కార్యదర్శి జబ్బర్ నాయక్ వి భరత్,ఏఐఎఫ్ డివై రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ దశరత్ నాయక్, ఎండి సుల్తానా బేగం,డి శ్రీనివాసులు, ఏఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, వేణుమాధవ్, జి.శివాని, రామ్మోహన్, నవీన్, పి.శ్యాంసుందర్, వెంకటేష్, ఆశీర్వాదం, కార్తీక్, మల్లేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png