గాంధీనగర్ డివిజన్‌లో బిజెపిని పటిష్టం చేసేందుకు కృషి చేయాలి
హైదరాబాద్, నవంబర్ 23, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్‌లో బిజెపిని పటిష్టం చేసేందుకు కృషి చేయాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి, దిశా కమిటీ సభ్యురాలు శారదా మల్లేష్ అన్నారు. రాబోయే రోజుల్లో గాంధీనగర్ డివిజన్ బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ముఖ్య కార్యక్రమాల కార్యాచరణ సమావేశం ఆదివారం అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్...