Addam News
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 7:15 am Posted by : Addam News

Elon Musk: వెండి ధరల మోత.. ఎలన్ మస్క్ ఆందోళన!

Elon Musk: వెండి ధరల మోత.. ఎలన్ మస్క్ ఆందోళన !

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బంగారం ధరలతో పోటీపడుతూ వెండి (Silver) ధరలు ఆకాశాన్ని తాకుతుండటంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు అమాంతం పెరిగిపోవడం పారిశ్రామిక రంగానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) వేదికగా, “ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అత్యంత అవసరం” అని పోస్ట్ చేశారు.

ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), సోలార్ ప్యానెళ్లు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. మస్క్ (Elon Musk)కు చెందిన టెస్లా కార్ల తయారీకి వెండి కీలకమైన ముడిసరుకు కావడంతో, ఈ ధరల పెరుగుదల వాహనాల ఉత్పత్తి వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ ఏడాది వెండి ధరలు ఏకంగా 158 శాతం పెరగడం గమనార్హం.

పారిశ్రామిక డిమాండ్ విపరీతంగా పెరగడం, స్పెక్యులేటివ్ ట్రేడింగ్, సరఫరాలో కొరత ఈ పెరుగుదలకు (Silver Prices) ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత మార్కెట్లోనూ వెండి ధరలు కిలోకు సుమారు రూ. 2.5 లక్షల వరకు చేరడం సామాన్యులను, పారిశ్రామికవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png