Addam News
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 9:53 pm Posted by : Addam News

పాఠశాల స్థాయిలో ఇచ్చే ప్రోత్సాహమే దేశానికి మంచి క్రీడాకారులను అందిస్తుంది – ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

క‌వాడిగూడ‌,  సెప్టెంబర్  21,  ( అద్దం న్యూస్ ) :   పాఠశాల స్థాయిలో ఇచ్చే ప్రోత్సాహమే దేశానికి మంచి క్రీడాకారులను అందిస్తుందని ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా స్థాయిలో జరిగిన ఆటల పోటీల్లో హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌లోని ఇంగ్లీష్ యూనియన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు.

పదవ తరగతికి చెందిన ఇ.రిత్విక్ సాయి అండర్ 17 విభాగంలో కరాటే పోటీలో బంగారు పతకాన్ని, ఏడవ తరగతి విద్యార్థి జి.రామ్ తేజ అండర్ 14 విభాగంలో కరాటే పోటీలో బంగారు పతకాన్ని సాధించారు. ఈ సంద‌ర్భంగా వారిని పులిగారి గోవ‌ర్థ‌న్ రెడ్డి ఘ‌నంగా స‌న్మానించారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆటల్లో విద్యార్థులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి గెలుపున‌కు బాటలు వేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని, పాఠశాల ప్రిన్స్‌పాల్‌ స్వర్ణలత ను, ఉపాధ్యాయుల కృషి పట్ల విద్యార్థి తల్లిదండ్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png