పాఠశాల స్థాయిలో ఇచ్చే ప్రోత్సాహమే దేశానికి మంచి క్రీడాకారులను అందిస్తుంది – ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

క‌వాడిగూడ‌,  సెప్టెంబర్  21,  ( అద్దం న్యూస్ ) :   పాఠశాల స్థాయిలో ఇచ్చే ప్రోత్సాహమే దేశానికి మంచి క్రీడాకారులను అందిస్తుందని ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా స్థాయిలో జరిగిన ఆటల పోటీల్లో హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌లోని ఇంగ్లీష్ యూనియన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. పదవ తరగతికి చెందిన ఇ.రిత్విక్ సాయి అండర్ 17 విభాగంలో కరాటే పోటీలో బంగారు పతకాన్ని, ఏడవ తరగతి విద్యార్థి జి.రామ్ తేజ...