శ్రీ సాయి రెసిడెన్సిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు….
కాచిగూడ, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు నిలుస్తాయి. శనివారం రాత్రి అంబర్పేట నియోజకవర్గం గోల్నాకలోని శ్రీ సాయి రెసీడెన్సీ ఆధ్వర్యంలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయ పద్దతిలో సహజ సిద్ధంగా తయారు చేసిన బతుకమ్మ వేడుకలను మహిళలు అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ విశిష్టతలు, సంస్కృతి, సంప్రదాయాలకు నేటి యువతరానికి తెలియజేయాలని శ్రీ సాయి రెసిడెన్సి మహిళలు సూచించారు. ఈ కార్యక్రమంలో బోగ వెంకటమ్మ,...