Addam News
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 6:23 am Posted by : Addam News

ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో స‌త్తా చాటిన ఇంగ్లీష్ యూనియ‌న్ స్కూల్ విద్యార్థులు

ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో వంద శాతం ఉత్తీర్ణ‌త సాధించిన
ఇంగ్లీష్ యూనియ‌న్ స్కూల్ విద్యార్థులు

ముషీరాబాద్‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :  తెలంగాణ‌లో ఇటీవ‌ల విడుద‌లైన‌ ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ‌కు చెందిన ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ విద్యార్థులు స‌త్తా చాటారు. నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ఱ‌త సాధించారు. పాఠశాలలో 217 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాయగా.. అందులో బాలికలు 109, బాలురులు 108 ఉన్నారు. అందులో ఏ-1 గ్రేడ్ వచ్చిన వారు 11 మంది విద్యార్థులు కాగా, 600 ల మార్కులకుగాను 500 ల మార్కులు 134 మంది విద్యార్థులున్నారు. ఈ సంద‌ర్భంగా ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ప్రిన్సిపాల్ స్వ‌ర్ణ‌ల‌తా రెడ్డి లు విద్యార్థుల‌కు పుష్ప‌గుచ్చాల‌ను అంద‌చేసి అభినందించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png