ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి – అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శాశ్వత ప్రాతిపదికన యూత్ గేమ్స్ ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఈ క్రీడల కోసం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన...