భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించేలా పనులు సాగేలా చూడండి – అధికారులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : ప్రస్తుత అవసరాలనే కాకుండా భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని పనులు ముందుకు సాగేలా చూడాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం.. శిల్ప, వాస్తు కళను పరిశీలించి, అవి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని...