Addam News
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 10:10 pm Posted by : Addam News

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటరుగా నమోదు చేసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

హైద‌రాబాద్ బ్యూరో, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓటరుగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తన ఓటు నమోదు చేసుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదుపత్రం ఫిల్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానాల్లో అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సరైన సమయం ఇదేనని యువతకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రశ్నించే గొంతుక అని.. తమ పార్టీ నుంచి రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో మంచి వాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికైనా యువకులు, నిరుద్యోగులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.