అసెంబ్లీ మీడియా కమిటీని వెంటనే ఏర్పాటు చేయండి – అసెంబ్లీ కార్యదర్శికి టీడబ్ల్యూజేఎఫ్ లేఖ

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కొత్త మీడియా కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన గురువారం అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అసెంబ్లీలో మీడియా కమిటీ మారలేదని, కొత్త కమిటీ వేయకపోవడం, పాత కమిటీ పని చేయకపోవడం వల్ల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చాలా మంది మీడియా ప్రతినిధులకు ఎంట్రీ పాస్ లు లభించడం లేదని పేర్కొన్నారు....