ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలి – కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ
హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలని కవాడిగూడ కార్పొరేటర్ జి.రచన శ్రీ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ శెట్టి బలిజ సంక్షేమ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఆమె సన్మానించారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేటర్ జి.రచన శ్రీ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రచన శ్రీ...