ప‌ద్మ‌శాలి సంఘం ఆధ్వ‌ర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు

ప‌ద్మ‌శాలి సంఘం ఆధ్వ‌ర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు హైదరాబాద్, జ‌న‌వ‌రి 18, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముషీరాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల గ్రౌండ్‌లో జరిగిన ఈ ముగ్గుల పోటీలో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా ముగ్గులను వేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్‌ హాజ‌ర‌య్యారు....