బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలి – ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, నవంబర్ 19, అద్దం న్యూస్ : బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలని, అరెస్టు చేసిన మావోయిస్టులను కోర్టుల్లో హాజరుపర్చాలని, ఎన్‌కౌంటర్ల పై న్యాయ విచారణ జరపాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు. ఈ మేరకు బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో నిన్న మావోయిస్టు అగ్రనాయకులు హిడ్మాతో, పాటు ఆయన భార్య, అలాగే ఆరుగురు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారన్నారు. అదే ప్రాంతంలో బుధవారం మరో ఎన్‌కౌంటర్ జరిగిందని,...