యూరియా కొరతతో అల్లాడుతున్న రైతాంగం – తెలుగుదేశం నాయకుల ధ్వజం
యూరియా కొరతతో అల్లాడుతున్న రైతాంగం – కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి ఇదే నిదర్శనం – తెలుగుదేశం నాయకుల ధ్వజం హైదరాబాద్, జనవరి 3, అద్దం న్యూస్ : రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నెలకొన్న తీవ్ర యూరియా కొరతపై సికింద్రాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నదాతలు ఆకలితో కాకుండా, సాగు కోసం ఎరువుల కోసం దిక్కులు చూస్తున్న పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమని వారు మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని...