కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి – పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్‌, నాగ‌రాజు

హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ :    రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టేలా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్‌, పొడపంగి నాగ‌రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వం విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కరించి వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం మూడువేల పై...