Addam News
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 11:34 am Posted by : Addam News

 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి

 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి
– బిజెపి ఎస్సీ మోర్చ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్‌

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 7, ( అద్దం న్యూస్ ) :   విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.12,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిజెపి ఎస్సీ మోర్చ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.12,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్, బిజెపి ఎస్సీ మోర్చ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జ‌రిగింది. ప‌లువురు నేత‌ల‌ను అరెస్ట్ చేవారు. ఈ సంద‌ర్భంగా బిజెపి ఎస్సీ మోర్చ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ మాట్లాడుతూ… విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బిజెపి, బీజేవైఎం ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నాయన్నారు. ఇందిరాపార్క్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తామన్నా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసుల దాడిలో ఒక మహిళా కార్పొరేటర్‌తో సహా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో, ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు. అక్రమ అరెస్టులు, పోలీసుల లాఠీలకు బిజెపి భయపడదన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించే దాకా పోరాటం కొనసాగుతూనే ఉంటుంద‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png