Addam News
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 3:24 pm Posted by : Addam News

గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ సిఐ వంశీ కృష్ణ‌కు స‌న్మానం

గాంధీన‌గ‌ర్‌, న‌వంబ‌ర్ 8, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ న‌గ‌రంలోని గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన వంశీ కృష్ణ‌ను షెడ్యూల్ కులాల హ‌క్కుల‌ ప‌రిర‌క్ష‌ణ సంఘం రాష్ట్ర నాయ‌కులు డి.సుద‌ర్శ‌న్ బాబు, రాపాక అశోక్‌, ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు మాచ‌ర్ల ప్ర‌భాక‌ర్‌, పుల్లూరి వినోద్ కుమార్ త‌దిత‌రులు సోమ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సిఐ వంశీ కృష్ణ‌కు శాలువా క‌ప్పి, పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌చేసి ఘ‌నంగా స‌త్క‌రించి శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్‌సిఆర్‌పిఎస్ రాష్ట్ర నాయ‌కుడు సుద‌ర్శ‌న్ బాబు మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణకు నూతన ఇన్‌స్పెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్టేషన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ప్రజలు, నాయకుల తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా సిఐ వంశీ కృష్ణ మాట్లాడుతూ… పోలీస్‌స్టేష‌న్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అవలంబిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తానని, ప్రజలు భయాందోళనలు లేకుండా జీవించేలా రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.