Addam News
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 4:21 am Posted by : Addam News

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం

ముషీరాబాద్‌, ఆగ‌స్టు 17, ( అద్దం న్యూస్ ) :   ప్ర‌జ‌ల‌కు చేస్తున్న విశిష్ట సేవ‌ల‌ను గుర్తించి హోలీ స్పిరిట్ క్రిస్టియ‌న్ యూనివ‌ర్శిటీ ( హెచ్ఎస్‌సియు ) వారు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు డాక్ట‌రేట్ ను ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ముషీరాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మ‌కారులు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రేషం మ‌ల్లేష్‌, క‌ల్వ‌గోపి, సిరిగిరి శ్యామ్‌, బ‌ల్లెక‌రి రాములు, బల్లెక‌రి ర‌మేష్‌, వెంక‌టేష్‌, మ‌ధు త‌దిత‌రులు బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు ముఠా జైసింహ‌తో క‌లిసి ఎమ్మెల్యే గోపాల్‌కు పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌చేసి, శాలువా క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ డాక్ట‌రేట్‌ను పొందిన ఎమ్మెల్యేకు శుభాకాంక్ష‌లను తెలియ‌చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png