Addam News
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 2:34 am Posted by : Addam News

వి.హ‌నుమంత‌రావుకు ఘ‌నంగా స‌న్మానం

తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ అభివృద్ధి స‌ల‌హాదారుగా నియ‌మితులైన
వి.హ‌నుమంత‌రావుకు ఘ‌నంగా స‌న్మానం

హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ స‌ల‌హాదారుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి, మాజీ పిసిసి అధ్య‌క్షుడు వి.హ‌నుమంత‌రావు నియమితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ లేబ‌ర్ స‌ల‌హామండ‌లి బోర్డు వైస్ చైర్మ‌న్ జి.నాగ‌భూష‌ణం, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఆర్‌.ల‌క్ష్మ‌ణ్ యాద‌వ్‌, తొలుపునూరి కృష్ణాగౌడ్‌, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి, ఉజ్జ‌యిని మ‌హంకాళి దేవాల‌యం బోర్డు స‌భ్యుడు గుండెల్లి దేవి వ‌ర ప్ర‌సాద్ త‌దిత‌రులు గురువారం వి.హ‌నుమంత‌రావును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బిసి సంక్షేమ శాఖ డెవ‌ల‌ప్‌మెంట్ స‌ల‌హ‌దారులుగా నియమితులైనందుకుగాను వి.హ‌నుమంత‌రావుకు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png