ముషీరాబాద్, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) :
దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద గల జై మాతాది అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన పూజలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, కరికె కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముచ్చకుర్తి ప్రభాకర్, కరికె కిరణ్ కుమార్లకు నిర్వాహకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ముదిరాజ్ తదితరులున్నారు.![]()