Addam News
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 7:43 am Posted by : Addam News

FIFA Peace Prize: డొనాల్డ్‌ ట్రంప్‌నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు ఫిఫా శాంతి బహుమతి (FIFA Peace Award) ప్రకటించింది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ (FIFA World Cup 2026) పోటీలకు సంబంధించి వాషింగ్టన్‌ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ప్రకటిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో పేర్కొన్నారు.

అవార్డును అందుకున్న అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటిగా అభివర్ణించారు. అవార్డులతో సంబంధం లేకుండా తన దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగో శాంతి ఒప్పందమే అందుకు గొప్ప ఉదాహరణ అని, కాంగో-రువాండా మధ్య హింసను నివారించడానికి తాను చర్యలు తీసుకున్నానని తెలిపారు. అలాగే, ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని సైతం తానే ఆపానని, తన దౌత్యం వల్ల ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయాయని లేదా మొదలు కాకముందే ముగిశాయని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ శాంతి బహుమతిని ట్రంప్‌ ఆశించినప్పటికీ, అది వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోకు దక్కడంతో ఆయన నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ఫిఫా శాంతి బహుమతి ఆయనకు దక్కడం గమనార్హం.

ట్రంప్‌కు అవార్డు.. రాజకీయ రంగు

2026 ప్రపంచకప్‌ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఈ తొలి బహుమతిని ఇన్‌ఫాంటినో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన బంగారు పతకాన్ని అందుకున్నారు. ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ, ప్రపంచ దౌత్యంలో ఆయన పాత్ర ఎనలేనిదని, ఎన్నో యుద్ధాలను నివారించారని ఇన్‌ఫాంటినో కొనియాడారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఈ ‘శాంతి బహుమతి’కి రాజకీయ రంగు పులుముకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png