Addam News
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 2:37 pm Posted by : Addam News

నాడు అసాంఘిక కార్య‌క‌లాపాల‌పై పోరాటం – నేడు ఇంట‌ర్ సెకండియ‌ర్‌లో మెరిసిన హ‌రిణి

 

నాడు అసాంఘిక కార్య‌క‌లాపాల‌పై పోరాటం

నేడు ఇంట‌ర్ సెకండియ‌ర్‌లో మెరిసిన హ‌రిణి

వేముల‌వాడ‌, ఏప్రిల్ 22, అద్దం న్యూస్ :   నాడు అసాంఘిక కార్య‌క‌లాపాల‌పై పోరాటం చేసిన చిన్నారి వెల్దండి హరిణి నేడు ఇంట‌ర్ సెకండియ‌ర్‌లో మెరిసింది. రాష్ట్ర స్థాయిలో ఇంట‌ర్ సెకండియ‌ర్ ఫ‌లితాల్లో 960 మార్కులు సాధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన వెల్దండి హరిణి చిన్నప్పటి నుండి చదువులో ముందుండి తన నాన్న వెల్డండి స‌దానందం పోరాట పటిమను అందిపుచ్చుకుని ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునే తత్వం కాదు. పదవ తరగతిలోనే మోడల్ స్కూల్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోరాటం చేసి ప్రిన్సిపాల్, డిఈఓ, ఎంఈఓ తో పాటు అనేక మందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడంలో హరిణి పోరాట పాత్ర ఉంది. తాను చేసిన ఉద్యమంతో మోడల్ స్కూల్లో అనేక అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కుంటూ తాను ఎప్పటికైనా జడ్జ్ కావాలనే కోరికతో పదవ తరగతి, ఇంటర్, ఇంటర్ సెకండియర్‌లో మొదటి స్థానంలో నిలిచింది. హ‌రిణి భ‌విష్య‌త్‌లో తాను అనుకున్న‌ది సాధించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png