Addam News
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 11:22 pm Posted by : Addam News

నాగేశ్వర్ పై అక్రమ కేసులు వేయడం మేధావుల గొంతు నొక్క‌డ‌మే

నాగేశ్వర్ పై అక్రమ కేసులు వేయడం మేధావుల గొంతు నొక్క‌డ‌మే
– తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

హైద‌రాబాద్‌, మే 27, ( అద్దం న్యూస్ ) :   మాజీ ఎమ్మెల్సి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పై అక్రమ కేసులు వేయడం అంటే మేధావుల గొంతునొక్క‌డమే అవుతుంద‌ని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వీనర్, తెలంగాణ పంచాయతీ రాజ్ మాజీ ట్రిబ్యునల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కవాడిగూడలో విలేకరులతో మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై, దేశంలో జరుగుతున్న అనేక సామాజిక అంశాలపై మాట్లాడే స్వేచ్ఛ మేధావులకు ఉందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తెలంగాణ మేధావులపై అన్యాయంగా కేసులను నమోదు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మేధావులపై జరుగుతున్న ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బావ స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ఆ హక్కును ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. మేధావుల మౌనం దేశానికి ఎంతో ప్రమాదకరమైందనే విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు గ్రహించాలని సూచించారు. విశ్లేష‌ణ‌లు న‌చ్చ‌క‌పోతే ప్రచుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా ఖండించాలి త‌ప్ప‌… కేసులు పెట్టి గొంతుక‌ల‌కు నొక్కుదామ‌నే భావ‌న స‌రైందికాద‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png