AVM Saravanan: సినీ దిగ్గజం AVM కన్నుమూత

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. ప్రముఖ నిర్మాత, ఏవీఎం స్టూడియోస్ యజమాని AVM శరవణన్ (AVM Saravanan) (86) అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. 1945లో ఆయన తండ్రి ఏ.వి.మెయ్యప్పన్ స్థాపించిన ప్రఖ్యాత 'ఏవీఎం ప్రొడక్షన్స్' పగ్గాలు చేపట్టి, దాన్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత శరవణన్‌ది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో 300కు పైగా చిత్రాలను నిర్మించిన ఏవీఎం శరవణన్, తన నిర్మాణ విలువలతో సినీ రంగానికి మార్గదర్శకుడిగా నిలిచారు....