గణనాథుడి చెంతకు సినీ తారలు
తార్నాక, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ మాణికేశ్వర్‌నగర్‌లో గండికోట విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీనటులు శివాజీరాజా, చంద్రకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీనటుల రాకతో మండపం వద్ద సందడి నెలకొంది. నిర్వాహకులు, భక్తులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినీనటులు శివాజీరాజా, చంద్రకాంత్‌లను శాలువాలతో గండికోట విజయ్‌కుమార్ ఘనంగా సత్కరించారు....