ముషీరాబాద్, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) :
మద్యం సేవించి వాహనాలను నడిపిన 14 మందిని హైదరాబాద్ చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి, నాంపల్లిలోని ఎంఆర్ కాంప్లెక్స్లో ఉన్న 10వ జెఎంఎఫ్సి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ 14 మందిలో 5 మందికి జరిమానా, మరో 5 మందికి జరిమానాతో పాటు రెండు రోజుల సామాజిక సేవ ( community service ), ఒకరికి జరిమానాతో పాటు 6 నెలలు లైసెన్స్ సస్పెండ్ చేసే శిక్ష విధించారు. మిగతా ముగ్గురుకి రెండవ సారి మద్యం సేవించి వాహనం నడిపిన వారిలో ఒకరికి జరిమానా, మూడు రోజుల జైలు, ఇద్దరు జరిమానా కట్టకపోవడంతో తొమ్మిది రోజుల జైలు శిక్షలను కోర్టు విధించింది. 14 మంది నుంచి రూ.62 వేల 400 రూపాయల జరిమానా వసూలు చేశామని చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ఎడుకొండలు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇలాంటి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.