వెట్టి చాకిరీపై తిరగబడ్డ ఫిరంగి దొడ్డి కొమరయ్య – సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, టిపిఎస్‌కె రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు
హైదరాబాద్, అద్దం న్యూస్ : వెట్టిచాకిరి పై తిరగబడ్డ ఫిరంగి దొడ్డి కొమురయ్య అని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, టిపిఎస్‌కె రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 3వ తేదీన బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్న దొడ్డి కొమరయ్య 98వ జయంతి సభ సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పాశం యాదగిరి, భూపతి వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ... దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వెట్టి...