కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నగరంలోని అమీర్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలోని శివమ్‌ టెక్నాలజీస్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బ్యాటరీలు పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడి కోచింగ్‌ సెంటర్లలోని విద్యార్థులను బయటకు పంపించారు. దర్యాప్తు కొనసాగుతోంది.. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా బ్యాటరీల నిర్వహణ లోపం వంటి అంశాలను...