Tata-Ernakulam Express: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
Tata-Ernakulam Express: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విశాఖపట్నం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. టాటా నగర్ నుంచి ఎర్నాకుళం (Tata-Ernakulam Express) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు (నెం. 18189) అనకాపల్లి (Anakapalli) సమీపంలో మంటలకు గురైంది. ఈ దుర్ఘటనలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో రైలు నర్సింగబల్లి - ఎలమంచిలి మధ్యలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. B1...