అడ్డ‌గుట్ట ప‌రిస‌రాల్లో లాలాగూడ పోలీసుల కవాతు

అడ్డగుట్ట, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజలకు భద్రతాభావం కల్పించడం కోసం లాలాగూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అడ్డ‌గుట్ట ప్రాంతంలో శుక్ర‌వారం ఫ్లాగ్ మార్చ్ ( కవాతు ) నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిల‌క‌ల‌గూడ డివిజ‌న్ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి మాట్లాడుతూ... పండుగలను అందరూ శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిస్తూ ఆయ‌న భరోసానిచ్చారు. పోలీసులకు, సాధారణ ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించడం జ‌రుగుతుంద‌న్నారు. పండుగ...