Addam News
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 1:08 am Posted by : Addam News

SIR : ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించండి

SIR ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియలో
ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించండి
– జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషన‌ర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్‌

హైద‌రాబాద్ బ్యూరో, జూలై 8, ( అద్దం న్యూస్ ) :    SIR ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియలో ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషన‌ర్ ఆర్‌వి.క‌ర్ణ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం హైద‌రాబాద్ చార్మినార్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చంచ‌ల్‌గూడ‌, చావ్నీ ప్రాంతాల్లోని పోలింగ్ స్టేష‌న్లు 274, 283 వ‌ద్ద జ‌రుగుతున్న SIR ( స్పెషల్ ఇంటింటికీ వెరిఫికేషన్ ) కార్యకలాపాలను క‌ర్ణ‌న్ పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి, ప్రక్రియను పరిశీలించడంతో పాటు వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

SIR ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ ప్రక్రియ క్షేత్రస్థాయిలో అమలు తీరును జిల్లా ఎన్నికల అధికారి ( DEO ) సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఓటర్లకు సమర్థవంతంగా సేవలు అందిస్తూనే కేటాయించిన పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఎన్నికల నమోదు అధికారి (ERO), సహాయ ఎన్నికల నమోదు అధికారులు ( AEROs ), BLO పర్యవేక్షక అధికారులు, బూత్ స్థాయి అధికారులు ( BLOs ), బూత్ స్థాయి ఏజెంట్లను ( BLAs ) ల‌ను క‌ర్ణ‌న్‌ ఆదేశించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png