భాగ్యనగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
ముషీరాబాద్, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) : వినాయక నవరాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి కాలనీలో భాగ్యనగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు మాచర్ల గోవిందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ మండపంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి నర్సింగరావు, శ్రవణ్, టింకు, మురళీ తదితరులు పాల్గొన్నారు.