Addam News
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 9:49 am Posted by : Addam News

Lionel Messi: కోల్‌కతాలో ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (Lionel Messi) కోల్‌కతాకు చేరుకున్నాడు. 2011 తర్వాత ఈ స్టార్‌ ఆటగాడు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. కోల్‌కతా టూర్‌లో భాగంగా లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించనున్నాడు. అనంతరం టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ, బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీలను కలుస్తాడు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. గోట్‌ కప్‌ పేరుతో ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఆడతాడు.

డిసెంబర్ 13-15 వరకు మెస్సీ భారత్‌లో పర్యటించనున్నాడు. డిసెంబర్ 13 ఉదయం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌‌కు వెళ్లనున్న మెస్సీ.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు. డిసెంబర్ 14 సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియానికి వెళ్తారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోకి అరుణ్‌జైట్లీ స్టేడియాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే ఈ పర్యటనపై మెస్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png