Addam News
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 1:22 am Posted by : Addam News

గాంధీన‌గ‌ర్‌లో ” ఒక మొక్క… అమ్మ పేరుతో ” కార్యక్రమం

” ఒక మొక్క… అమ్మ పేరుతో “ కార్యక్రమంలో భాగంగా
మొక్కలు నాటిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని

హైదరాబాద్,  జూన్ 5, ( అద్దం న్యూస్ ) :     ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ” ఒక మొక్క… అమ్మ పేరుతో ” ( ఎక్ పేడ్.. మా కె నామ్ ) లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ కెనరా బ్యాంక్ పార్క్‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం జ‌రిగింది. శుక్ర‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా బిజెపి సికింద్రాబాద్ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్ గౌడ్‌, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మొక్క‌ల‌ను నాటారు. ఈ సంద‌ర్భంగా మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటుదాం–పర్యావరణాన్ని కాపాడుకుందామ‌న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మనకు జన్మనిచ్చిన తల్లిని, మనల్ని భారాన్ని మోస్తూ.. పోషిస్తున్న భూమాతను గౌరవిస్తూ ‘ అమ్మ పేరుతో ఒక మొక్క ’  అనే  నినాదంతో మొక్కలు నాటాలన్నారు.

నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. భూ మండలంపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి కన్వీనర్ రామ్ రెడ్డి, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, డివిజన్ సీనియర్ నాయకులు శ్రీకాంత్, రాజు, ఎం.ఉమేష్, బాల కృష్ణ, పాల శ్రీనివాస్, సత్తిరెడ్డి, మహమూద్, ప్రకాష్ యాదవ్, శివ కుమార్, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, జ్ఞానేశ్వర్, జిడి.రాజు, సంయుక్త రాణి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png