Addam News
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 4:51 am Posted by : Addam News

నారి శక్తి స్వరూప కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పావని

 నారి శక్తి స్వరూప కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పావని

హైదరాబాద్, మార్చి 8, అద్దం న్యూస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అహల్య ఉమెన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్ట‌ర్‌.పూనమ్ నోముల్వర్ ఆధ్వర్యంలో జ‌రిగిన‌ నారి శక్తి స్వరూప కార్యక్రమం జ‌రిగింది. సేవ, అభివృద్ధి పథంలో విజయాలు సాధించిన మహిళా మణులను గౌరవించే కార్యక్రమంలో భాగంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌, గౌరవ అతిథులుగా డిసిపి సునీత, డాక్ట‌ర్‌.మీనాక్షీ పద్భనాభం, డాక్ట‌ర్‌.కాంచన్, అమిత రాణి, సారిక భర్గె, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాజీ కార్పొరేట‌ర్ పావ‌నిని ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో గీతికా, పాయల్ నోమల్వర్, విజేందర్, కిరణ్, సూర్య, ఎన్.రమేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png