Addam News
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 6:45 am Posted by : Addam News

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మాజీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మాజీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 28, ( అద్దం న్యూస్ ) :   రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డికి శ్రీలత శోభన్ రెడ్డి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కా త‌మ్ముళ్ల‌ మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ పవిత్రమైన రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ, కుటుంబాల్లో ప్రేమానురాగాలు, సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png