Addam News
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 7:19 am Posted by : Addam News

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని

హైద‌రాబాద్‌, జూన్ 27, ( అద్దం న్యూస్ ) :   రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR ) ప్రక్రియను గాంధీనగర్ డివిజన్‌లో బూత్ స్థాయి అధికారులు, బిజెపి బూత్ ఏజెంట్ల‌తో కలిసి మాజీ కార్పొరేటర్ ఎ.పావని ప్రారంభించారు. డివిజన్‌లోని 4, 10, 16, 17, 18 బూత్‌ల‌లో SIR కార్యక్రమాన్నిఆమె ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా బూత్ లెవల్ అధికారులతో ఆమె మాట్లాడుతూ… సమగ్ర ఓటర్ల జాబితా ప్రక్షాళనను సమర్ధవంతంగా నిర్వహించాలని, అధికారులకు అన్నివిధాలా సహకరించేందుకు తమ పార్టీ బిజెపి బూత్ ఏజెంట్లు సహాయం అందిస్తారని అన్నారు. రెండు రోజులు ఆలస్యంగా మొదలైన SIR ప్రక్రియ, పూర్తి చేసేందుకు నిర్ణయించిన గడువును మరో వారం రోజులకు పెంచాలని ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సీనియర్ నాయకులు దామోదర్, పూర్ణ, సాయి గౌడ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png