ఒడిశా గ‌వ‌ర్న‌ర్‌ హ‌రిబాబును క‌లిసిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

ఒడిశా గ‌వ‌ర్న‌ర్‌ హ‌రిబాబును క‌లిసిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ విజయవాడ, మే 8, ( అద్దం న్యూస్ ) :  ఒడిశా గ‌ర‌వ్న‌ర్ డాక్ట‌ర్‌.కె.హ‌రిబాబును మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ శుక్రవారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌య‌వాడ‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా వారిరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలు, జాతీయ ప్రయోజనాలపై వారు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపారు. ఒడిశా ప్రజలకు, దేశానికి డాక్ట‌ర్‌.కె. హరిబాబు అందిస్తున్న నిరంతర సేవలకుగాను ఆయ‌న‌కు బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.