Addam News
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 2:42 pm Posted by : Addam News

అతడిని తొలగిస్తారని ఊహించలేదు: మాజీ కెప్టెన్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను 2026 టీ20 ప్రపంచకప్‌నకు పక్కన పెట్టడంతో షాక్‌ అయ్యానని భారత మాజీ కెప్టెన్, చీఫ్‌ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) పేర్కొన్నాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ప్రస్తుత సెలక్షన్ కమిటీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని తాను ఊహించలేదన్నాడు. అదే సమయంలో ప్రపంచ కప్‌నకు ఎంపిక చేసిన జట్టు అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు.

‘నేను ఆశ్చర్యపోయా. ఇది అద్భుతమైన సెలక్షన్. శుభ్‌మన్ గిల్‌(Shubman Gill)ను తొలగిస్తారని నేను ఊహించలేదు. తొలుత అతనిని వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా గిల్ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. వన్డేల్లో శుభ్‌మన్ గిల్ గొప్ప ఆటగాడు. టెస్టుల విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌లో భారీగా పరుగులు చేశాడు. కానీ, టీ20ల్లో ఇబ్బందిపడుతున్నాడు. ఇషాన్ కిషన్ (Ishan Kishan) లేదా మరెవరితోనైనా పోలిస్తే గిల్ స్ట్రైక్‌రేట్ చాలా తక్కువ. దేశవాళీలో అదరగొట్టిన ఇషాన్‌ను ఎంపిక చేయడం మంచి విషయం. రింకు సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. మొత్తంమీద సెలక్షన్ కమిటీ అద్భుతమైన టీమ్‌ను ఎంపిక చేసింది. అభిషేక్ శర్మ, సంజుశాంసన్ ఓపెనింగ్ చేస్తారు. అభిషేక్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్’ అని క్రిస్ శ్రీకాంత్ అన్నాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png