అతడిని తొలగిస్తారని ఊహించలేదు: మాజీ కెప్టెన్
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను 2026 టీ20 ప్రపంచకప్‌నకు పక్కన పెట్టడంతో షాక్ అయ్యానని భారత మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) పేర్కొన్నాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ప్రస్తుత సెలక్షన్ కమిటీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని తాను ఊహించలేదన్నాడు. అదే సమయంలో ప్రపంచ కప్‌నకు ఎంపిక చేసిన జట్టు అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ‘నేను ఆశ్చర్యపోయా. ఇది అద్భుతమైన సెలక్షన్. శుభ్‌మన్ గిల్(Shubman Gill)ను తొలగిస్తారని నేను...