Addam News
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 2:59 pm Posted by : Addam News

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య
500 రెట్లు అధికంగా ఇస్తామ‌ని న‌మ్మ‌బ‌లికిన సైబ‌ర్ నేర‌గాళ్లు
బంగారాన్ని తాక‌ట్టు పెట్టిన డ‌బ్బులు ఇచ్చిన ఊర్మిళ‌

అద్దం న్యూస్, వెబ్ డెస్క్ :    టెక్నాల‌జి ఏమి తెలియ‌ని సామాన్య ప్ర‌జ‌ల నుంచి చ‌దువుకుని ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉండే వారిని సైతం సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ ఉచ్చులోకి దింపి నిలువున దోచుకుంటున్నారు. ఎంద‌రో రాజ‌కీయ నేరస్థుల కేసుల‌ను చేధించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ వివి ల‌క్ష్మీ నారాయ‌ణ భార్య‌ను సైతం సైబ‌ర్ నేర‌గాళ్లు వ‌ద‌ల‌లేదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుండి రూ.2.58 కోట్ల రూపాయ‌ల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు కాజేశారు. తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో 500 రెట్లు అధికంగా డ‌బ్బులు ఇస్తామ‌ని సైబ‌ర్ నేర‌గాళ్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ వాట్సాప్ కు గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్‌లో మెసేజ్ పంపారు.

         వెన‌కా ముందు ఏమి ఆలోచించ‌కుండా ఊర్మిళ స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరింది. ఊర్మిళకు ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో, మాయ మాటలు చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు పంపి తాను చెప్పిన విధంగా పెడితే 500 రెట్లు లాభాలు వస్తాయని దినేష్ సింగ్ అనే వ్యక్తి న‌మ్మించాడు. దినేష్ సింగ్ మెసేజ్స్‌ను బలపరుస్తూ తనకు నిజంగానే లాభాలు వచ్చాయని గ్రూప్‌లో వాళ్ళ ముఠాలోని సభ్యురాలు ప్రియసఖి త‌దిత‌రులు స్క్రీన్ షాట్లు పెట్టించాడు. దీంతో వీళ్ల మాయ మాటలు నమ్మి యాపిల్ యాప్ స్టోర్ నుండి MCKIEY CM అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్యలో రూ.2.58 కోట్ల రూపాయ‌ల‌ను ఊర్మిళ బ‌దిలీ చేశారు. ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న బంగారం కూడా తనఖా పెట్టి మ‌రి రూ.2.58 కోట్ల రూపాయ‌ల‌ను సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు పంపించారు. యాప్‌లో లాభాలు కనిపించినా విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని, వాటిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png